జిల్లాలు | : | 33 |
భారీ ప్రాజెక్టులు | ||
పూర్తయిన ప్రాజెక్టులు | : | 12 |
ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు | : | 20 |
మధ్య తరహా ప్రాజెక్టులు | ||
పూర్తయిన ప్రాజెక్టులు | : | 33 |
ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు | : | 7 |
తెలంగాణ రాష్ట్రం జూన్ 2 2014 న అవతరించింది. బంగారు తెలంగాణగా
తీర్చి దిద్దుకునే క్రమంలో నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ
లభ్యమవుతున్న నీటి వనరులను ఉపయోగించుకొని వ్యవసాయ రంగం ,
పారిశ్రామిక రంగం పటిష్టం చేసుకుంటూ, తాగునీటిని సమకూర్చడానికి కృషి
చేస్తుంది. దీనికి గాను మన లక్ష్యాన్ని సాధించడానికి వివిధ సాగునీటి
ప్రాజెక్టులను అమలు చేయడంలో ఈ శాఖ ముఖ్య భూమిక పోషిస్తుంది.
తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అభివృద్ధి గోదావరి,
కృష్ణనదులు, వాటి ఉపనదులు , చెరువులు, సరస్సులపై ప్రధానంగా
ఆధారపడుతున్నది. తెలంగాణ ప్రాంతంలో చెరువులు అత్యంత ప్రాధాన్యత
వనరులుగా ఉన్నాయి. భారీ చెరువుల నుండి చిన్న కుంటలు, ఇంకుడు
చెరువులు అన్ని కలుపుకొని 46,531 నీటి వనరులు ఉన్నాయి. ఈ చెరువులను
పునరుద్ధరించి, పునర్జీవింప చేయడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం
చేప్పటింది. రాష్ట్ర సర్వతోభిమూఖాభివృధికి రెండు నదుల నీటిని
వినియోగించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ
లక్ష్యాన్ని సాధించడానికి గోదావరి మరియు కృష్ణ నదులలో ఆధారపడదగ్గ,
మిగులు వరద నీటిని సంపూర్ణంగా వినియోగించాలని ప్రభుత్వం ప్రణాలికను
రూపొందిస్తుంది.