About Us Welcome
Chief Minister


శ్రీ కే.చంద్రశేఖర రావు
గౌరవ ముఖ్య మంత్రి మరియు నీటి పారుదల శాఖ మంత్రి

About Us Welcome


వ్యవస్థ గురించి

తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం మనకు లభ్యమవుతున్న నీటి వనరులను ఉపయోగించుకొని వ్యవసాయ రంగం,పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసుకుంటూ ప్రతి కుటుంబానికి తాగు నీటిని సమకూర్చటం ఈ శాఖ యొక్క విధి మరియు బాధ్యత . దీనికి గాను వివిధ సాగునీటి వివిధ సాగునీటి ప్రాజెక్టులను అమలు చేయడం లో సాగునీటి శాఖ ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది.

అనావృష్టిపీడిత ప్రాంతాలు, మెత్త ప్రాంతాలకు సాగునీటి పారుదల సామర్ధ్యాన్ని ఏర్పాటు చేయడం, నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు నీటి యూనిట్ ఒక్కింటికి వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పరిరక్షించుకోడం అనేది తెలంగాణలో సాగునీటి పారుదల శాఖ ప్రధానోదేశంగా ఉన్నది.

తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అభివృద్ధి గోదావరి, కృష్ణనదులు, వాటి ఉపనదులు, చెరువుల సరస్సులపై ప్రధానంగా ఆధారపడుతున్నది. తెలంగాణ ప్రాంతంలో చెరువులు అత్యంత ప్రధానమైన వనరులుగా ఉన్నాయి. భారీ చెరువుల నుండి చిన్న కుంటలు, ఇంకుడు చెరువులు అన్ని కలుపుకొని 46 ,531 నీటి వనరులు ఉన్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించి, పునర్జీవింప చేయడానికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రెండు నదుల నీటిని వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.ఈ లక్ష్యాన్ని సాధించడానికి గోదావరి మరియు కృష్ణనదులలో ఆధారపడదగ్గ జలాలు, మిగులు వరద నీటిని సంపూర్ణంగా వినియోగించాలని ప్రభుత్వం ప్రాజెక్టులను రూపొందిస్తుంది

ఈ క్రింద విధముగా ప్రోజెక్టుల క్రింద సాగునీటి పారుదల ఆయకట్టు ఆధారంగా సాగునీటి పారుదల ప్రాజెక్టులన్నింటినీ వర్గీకరించడం జరిగింది.

క్రమ సంఖ్య ప్రాజెక్టు విభజన ఆయకట్టు ప్రాజెక్టుల సంఖ్యా
1 భారీ సాగునీటి ప్రాజెక్టులు 25,౦౦౦ ఎకరాలు (10,000 హెక్టార్లు)పైన ఉండే ఆయకట్టు 28
2 మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు 5000 ఎకరాల (2000 హెక్టార్లు)పైన మరియు 25000 ఎకరాల వరుకు (10000 హెక్టార్లు) ఆయకట్టు 39
3 చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు 5000 ఎకరాల (2000 హెక్టార్లు) వరకు ఉండే ఆయకట్టు 46,531

వీటికి అదనంగా రాష్ట్రంలోని ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పనులు, వరద నియంత్రణ పనులను కూడా పర్యవేక్షిస్తుంది.

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి, ప్రస్తుతం ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించడానికి గాను ఆర్ఐడిఎఫ్ (నాబార్డు), జెఐసిఎ (జపాన్ అంతర్జాతహేయ సహకార సంస్థ), భారత ప్రభుత్వం త్వరిత గతిన ప్రయోజన కార్యక్రమం (ఎఐబిపి) మరియు సాధారణ రాష్ట్ర ప్రణాళికకు అదనంగా ప్రపంచబ్యాంకు నుండి ఆర్ధిక సహాయాన్ని స్వీకరించడం జరుగుతున్నది.


సాగునీటి శాఖ ప్రధాన విధులు

1. సాగు తదితర ప్రయోజనాల కోసం నీటిని కేటాయించడంతో పాటు నదీ బేసిన్లలో నీటి లభ్యతను హైడ్రొలోజికల్ మదింపు చేయడం.

2. సాగునీటి పారుదల వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేయడం.

3. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి కోసం సాగునీటి సామర్ధ్యాన్ని ఏర్పాటు చేయడానికి కొత్త ప్రాజెక్టులు నిర్మించడం.

4. పురాతన ప్రాజెక్టులు పునఃనిర్మించడం ద్వారా ప్రస్తుత ఆయకట్టుము స్థిరీకరించడం.

5. పురాతన భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించడం.

6. సంభందిత శాఖలన్నీ ఏకీకృత, సహకార ప్రయత్నాల ద్వారా నీటి యాజమాన్యాన్ని, నీటి వినియోగ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం.

7. ప్రస్తుత సాగునీటి ప్రోజెక్టుల కోసం నిర్వహణ అమలు, నిర్వహణ ప్రణాలికను తాయారు చేయడం.

8. వరద నిర్వహణ.

9. వరద గట్ల పునరుద్ధరణ మరియు నిర్వహణ

10. పారిశ్రామిక, తదితర వినియోగాల కోసం సాగునీటి పారుదల ప్రాంతాన్ని మదింపు చేయడం, నీటి రాయల్టీ చార్జీలను మదింపు చేయడం.

11. నీటి లభ్యతపై సమాచారం, విశ్లేషలను సమర్పించడం, అంతర్ రాష్ట్ర నదీ బేసిన్లను వినియోగించడం, సంబంధిత ఆయా ట్రిబ్యునళ్లకు సమాచారాన్ని అందచేయడం

12. కొత్త ప్రాజెక్టు ఆయాకట్లను అన్వేషించడం


శాఖ వ్యవస్థీకృత ఏర్పాటు :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరాలకు అనుగుణంగా మరియు ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రస్తుతమున్న యూనిట్లను సృష్టించడం ద్వారా సాగునీటి పారుదల మరియు సిఏడి డిపార్టుమెంటును బలోపేతం చేయడం జరిగినది.

పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత సాగునీటి పారుదల 23 చీఫ్ ఇంజినీర్లతో పనిచేస్తుంది. అందులో సచివాలయ స్థాయిలో చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ చీఫ్ ఇంజనీర్ (ఎంక్వయిరీలు), చీఫ్ ఇంజనీర్ (విజిలెన్సు)పనిచేస్తున్నారు.ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్లు స్వతంత్రంగా తమ సంబంధిత యూనిట్లకు శాఖాధిపతులుగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ స్థాయి లో పరిపాలనాపరమైన విషయాలకు సంబంధించిన విధానాలు, బడ్జెటు, ఆర్థికపరమైన వ్యవహారాలను వారి సంయుక్త కార్యదర్శులు మొదలైన వారి సహాయంతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. సాగునీటి శాఖకు ఇంజనీర్-ఇన్-చీఫ్ (పరిపాలన) ముఖ్య అధిపతిగా ఉంటారు.ఈయన శాఖకు చెందిన సమగ్ర పరిపాలనకు ఇన్ చార్జిగా ఉంటారు . ఈ శాఖకు మరో ఇంజనీర్-ఇన్-చీఫ్ (సాగునీరు) అధిపతిగా ఉంటారు. ఈయన రాష్ట్రంలోని మొత్తం సాగునీటి ప్రోజెక్టులు అన్నింటికీ ఇంఛార్జిగా వ్యవహరిస్తారు. ఈ ఇంజనీర్స్-ఇన్-చీఫ్, ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ, శాఖాపరమైన కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంటారు.

సూపరింటెండింగ్ ఇంజినీర్లు సంబంధిత చీఫ్ ఇంజినీర్ల కింద పనిచేస్తూ ఒక సర్కిల్ కు ఇంఛార్జిగా వ్యవహరించే రీజినల్ అధికారులుగా ఉంటారు. వీరి అధికార పరిధి ఒక జిల్లాకు మించి ఉంటుంది. ఒక డివిజన్ కు ఇంఛార్జిగా ఉండే కార్యనిర్వాహక ఇంజినీరు సదరు డివిజన్ లోని అన్ని సాగునీటి పనుల నిర్మాణం, నిర్వహణకు ఇంఛార్జిగా ఉంటారు. ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఒక సబ్ డివిజన్ కు ఇంఛార్జిగా , సాగునీటి పనుల నిర్మాణం, నిర్వహణ ఇంచార్జీగా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియంత్రణ లో పనిచేస్తారు. సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు / సహాయక ఇంజనీర్ సాగునీటి నిర్మాణ మరియు నిర్వహణ పనులకు విభాగంలోపు ఇంఛార్జిగా , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నియంత్రణలో పనిచేస్తారు.

ఈ శాఖలో నాణ్యత కొరకు / నాణ్యత నియంత్రణ నిఘా విభాగం ప్రత్యేకంగా పని చేస్తుంది. పనుల విషయంలో ఎలాంటి అక్రమాలు జరిగినా తక్షణమే స్పందించి లోపభూయిష్ట పనులను నిరోధించుటకు మరియు ఎలాంటి అవినీతి జరిగిన తగిన చర్యలు తీసుకుంటుంది.

ఇంజినీరింగు, పరిశోధన, సామర్ధ్యం నిర్మాణ కార్యకలాపాలను చేపట్టేందు కోసం నీటి పారుదల శాఖలో వాలంతరి డైరెక్టర్ జనరల్ నియంత్రణలో ఒక ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబరేటరీ మరియు ఒక శిక్షణా సంస్థ వాలంతరీలను బలోపేతం చేయడం జరిగింది.

ఈ శాఖ లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్య హోదా మంజూరైన సంఖ్య
1 ఇంజనీర్స్-ఇన్-చీఫ్ 3
2 చీఫ్ ఇంజినీర్లు 23
3 సూపరింటెండింగ్ ఇంజినీర్లు 48
4 కార్యనిర్వాహక ఇంజినీర్లు 216
5 ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు 668
6 సహాయక కార్య నిర్వాహక ఇంజినీర్లు,సహాయక ఇంజినీర్లు 2434
ఇంజనీర్ క్యాడర్ల మొత్తం 3392
7 సర్కిల్ స్కేల్ మినిస్టీరియల్ మరియు టెక్నికల్ సిబ్బంది 7002
8 వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది 3070
వెరసి మొత్తం 13473

రాష్ట్ర పటము

newDistrictsMap